Bride in boat: ఏపీలో వరదలు కొనసాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Bride in boat: కోనసీమ జిల్లాను వరదలు ముంచెత్తాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో వరద నీటిలో స్థానికులు కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఈక్రమంలో పడవలోనే కళ్యాణ మండపానికి పెళ్లి కూతురు చేరుకుంది. అటు నుంచి వరుడి ఇంటికి వెళ్లింది. ఇప్పుడా విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.