#FollowTrafficRules ఎంత అత్యవసరంగా పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినా కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా, ప్రకటనలు ఇచ్చినా కొందరు వాహనదారులు తమ నిర్లక్ష్యాన్ని నిత్యం రోడ్లమీద ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ వాహనదారుల ప్రాణాలు పోవచ్చు, లేకపోతే వీరి నిర్లక్ష్యం కారణంగా అవతలి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.
ఫొటో గ్యాలరీ: భారత్‌కు వచ్చిన మరో విదేశీ అందం అదితి
ట్రాఫిక్ రూల్ పాటించకపోవడంతో ఎంత పని జరిగిందో చూడాలంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే విషయం అర్థమవుతుంది. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఆకుపచ్చ రంగు షర్ట్ ధరించిన బైకర్ రాంగ్ రూట్లో టర్న్ తీసుకోవడానికి యత్నించాడు. దీంతో ఎదురగా వస్తున్న వ్యక్తి తన స్కూటీని కాస్త పక్క లైన్‌కు డ్రైవ్ చేశాడు. దీంతో పక్కనే వెళ్తున్న వాహనానికి స్కూటీ ఢీకొవడం, ఆపై స్కూటీ ఢీకొనడంతో పాదచారుడు ఒక్కసారిగా పిట్టలాగ అతడు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు.
Also Read: టీఆర్పీల కోసం పెళ్లి చేస్తారా.. ఉదిత్ నారాయణ్‌పై ట్రోలింగ్!
Two-wheeler driver (in green shirt) trying to go in the opposite direction which forces another two-wheeler to change lane abruptly.
The sad part of this accident is two-wheeler rider doesn't understand his role in the accident. pic.twitter.com/JMwCBBLRwl— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) February 12, 2020
అసలేం జరిగింది అన్నట్లు బాధితుడి వైపు ఆ గ్రీన్ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి చూడటం విచారకరమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్వీట్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న ట్విటర్లో పోస్ట్ చేసిన ట్రాఫిక్ నిర్లక్ష్యానికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం (#FollowTrafficRules), మనతో పాటు తోటివారి ప్రాణాలకు హాని కలగకుండా చూసుకుందాం.