Shocking: మూడు నెలల కిందట చనిపోయిన మహిళకు రెండో డోసు టీకా..!

Covid Vaccine: వైద్య ఆరోగ్య సిబ్బంది బతికున్నా వాళ్లకే కాదు..చనిపోయిన వాళ్లకు కూడా టీకాలు వేస్తున్నారు. ఎక్కడనుకుంటున్నారా...

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 08:36 AM IST
  • చనిపోయిన మహిళకు కొవిడ్ వ్యాక్సిన్
  • తెలంగాణలో ఘటన
Shocking: మూడు నెలల కిందట చనిపోయిన మహిళకు రెండో డోసు టీకా..!

Telangana: చనిపోయిన మహిళ.. కరోనా టీకా రెండో డోసు(Covid Vaccine Second Dose) తీసుకుంది. అవాక్కయ్యారా...ఇదీ నిజం. తెలంగాణ(Telangana)  దమ్మాయిగూడ(Dammaiguda)కు చెందిన కె.కౌశల్య(81) మే 4న కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయించుకుంది. రెండు నెలల అనంతరం ఆమె అనారోగ్యంతో మరణించింది. 

ఈ విషయం తెలియకపోవడంతో.. రెండో డోసు టీకా గడువు సమీపిస్తుందంటూ సంబంధిత సిబ్బంది కౌశల్య కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. ఆమె మరణించి మూడు నెలలవుతుందని బదులిచ్చారు. 15 రోజుల అనంతరం (నవంబర్‌ 8న) కౌశల్య(Kousalya) టీకా రెండో డోసు తీసుకున్నట్లు సందేశం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తికి రెండో డోసు ఎలా వేశారంటూ అవాక్కయ్యారు. టీకా లక్ష్యం చేరుకోవాలనే తొందరలో సిబ్బంది చేస్తున్న పొరపాట్లుగా తెలుస్తోంది. 

Also Read: Peddapalli girl murder : పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలి హత్య

కరోనా వ్యాక్సిన్‌(Corona Vaccine)పై దేశా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవలె భారత్ వంద కోట్ల టీకా మార్క్ కూడా దాటింది. అయితే కొందరికి వ్యాక్సిన్ వేయకున్నా వేసినట్లు.. కొందరికి మొదటి డోస్ వేసి.. రెండో డోస్ వేయకున్నా  వేసినట్లు మెసెజ్‌లు వస్తున్నాయి. మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News