Telangana Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 3, 2023, 06:45 PM IST
Telangana Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Report: ఈశాన్య  బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై వున్న ఆవర్తనం ఆదివారం సముద్ర మట్టంకి  5.8 కిమీ ఎత్తు వరకు  అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయువ్య దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో  అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఆవర్తనం నుంచి  ద్రోణి ఒకటి ఉత్తర ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ-3.1 కి.మీ ఎత్తు  మధ్యలో విస్తరించి ఉందని చెప్పారు. మరో ఆవర్తనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 కి.మీ-5.8 కి.మీ ఎత్తు  మధ్యలో కేంద్రీకృతమై ఉందన్నారు.

విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి..  సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ద్రోణి  ఈరోజు బలహీన పడిందని తెలిపారు. సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక మీదుగా ఉన్న నిన్నటి ఆవర్తనం ఈరోజు బలహీన పడిందన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుంచి మోస్తారు  వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ అన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.  

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న మూడు రోజులు ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: Jamili Elections: వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం వెనుక పెద్ద కుట్ర.. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు  

Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News