Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు.. ఏపీకి తుపాన్ ముప్పు!

Telangana Weather Report. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 8, 2022, 09:07 AM IST
  • తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
  • ఏపీకి తుపాన్ ముప్పు
  • జమ్మికుంటలో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు.. ఏపీకి తుపాన్ ముప్పు!

Moderate rains in Telangana today and tomorrow: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంపై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతో కర్ణాటక వరకు గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు రోజులు వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదివారం (మే 8) నుంచి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలు మధ్యాహ్నం సమయంలో ఎండలో బయట తిరగవద్దని సూచించింది. శనివారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాలో కూడా 40 డిగ్రీలకు పైగా సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 

మరోవైపు ఏపీ రాష్ట్రానికి మ‌రో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతం తూర్పుతీరంలో ఏర్పడిన 'ఆసాని' తుఫాను ఏపీ వైపు వాయువేగంగా దూసుకొస్తుంది. మే 10 నాటికి తుఫాను రాష్ట్రంలో ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ఆసాని తుఫాను తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తుఫాను కారణంగా ఏపీ, బెంగాల్‌, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తుఫాను నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Also Read: Chris Gayle IPL: నాకు సరైన గౌరవం దక్కలేదు.. ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రిస్ గేల్!

Also Read: Happy Mothers Day 2022: నేడు మదర్స్ డే... మాతృమూర్తులకు 'గూగుల్ డూడుల్' స్పెషల్ విషెస్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News