Revanth Reddy: చంచల్‌గూడ జైలు తరలిస్తాం.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం

Old City Metro: మెట్రో రైలు విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కన్నా మెరుగ్గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామనే రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 8, 2024, 09:12 PM IST
Revanth Reddy: చంచల్‌గూడ జైలు తరలిస్తాం.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం

Hyderabad Metro: పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఫలక్‌నుమ సమీపంలో జరిగిన కార్యక్రమంలో ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో కలిసి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారు' అని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజన్‌ 20250ని వివరించారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Candidates List: కీలకమైన 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఈసారి మళ్లీ ఆయనకు మొండిచెయ్యి 

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే తమ దృష్టి అని పేర్కొన్నారు. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీగా అభివర్ణించారు. ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మేం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గండిపేట నుంచి 55 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం ఇప్పటికే లండన్ థేమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్‌తో కలిసి సందర్శించినట్లు తెలిపారు.

Also Read: Employment News: కేవలం రూ.25 చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం

మెట్రో విస్తరణపై మాట్లాడుతూ.. 'పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫెజ్-2 ను తీసుకొస్తున్నాం. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నాం. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రోను చేసి చూపిస్తాం' అని తెలిపారు. ఈ సందర్భంగా చంచల్ గూడ జైలును తరలింపుపై కీలక ప్రకటన చేశారు. 'జైలును అక్కడి నుంచి తరలించి అక్కడ విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తాం' అని ప్రకటించారు. 

రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్  అధికారంలో ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పని చేస్తామని ప్రకటించడం గమనార్హం. అంటే భవిష్యత్‌లో ఎంఐఎంతో పొత్తు ఆశిస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని భావిస్తున్నా. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకుతీసుకెళ్లాలి. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకారం అందిస్తుంది' అని ప్రకటించారు.

మళ్లీ కాంగ్రెస్‌, ఎంఐఎం దోస్తీ?
మెట్రో పనుల శంకుస్థాపన వేళ అరుదైన దృశ్యాలు కనిపించాయి. పదేళ్ల తెలంగాణలో ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ, ఎంఐఎం కలిసి పని చేశాయి. స్నేహాపూర్వకంగా మెలిగాయి. ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఎంఐఎంతో స్నేహం కోరుకుంటుందని రేవంత్‌ వ్యాఖ్యలు చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఎంఐఎం పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి మద్దతునివ్వడం అలవాటే. ఉమ్మడి ఏపీలో అదే జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో జత కట్టేందుకు అసదుద్దీన్‌ కూడా సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలను బట్టి కాంగ్రెస్‌, ఎంఐఎం బంధంపై స్పష్టత వస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News