Viral Video: పెళ్లాం కొట్టిందని పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన భర్త

Man crying for wife beating him: ఓ భార్యా బాధితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భార్య తనను కొడుతోందని ఏడుస్తూ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 04:42 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్‌గా భార్యా బాధితుడి వీడియో
    తన భార్య కొట్టిందని వెక్కి వెక్కి ఏడ్చిన బాధితుడు
    సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీస్ సిబ్బంది
Viral Video: పెళ్లాం కొట్టిందని పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన భర్త

Man Crying for wife beating him: భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడు మనస్పర్థలు, గిల్లికజ్జాలు కామన్. సమస్య ఏదైనా కొంతమంది ఇంట్లోనే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది వీధికెక్కి రచ్చ రచ్చ చేస్తారు. కానీ ఓ భార్యా బాధితుడికి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇంట్లో భార్యను ఎదిరించలేక... వీధికెక్కి ఆమెను నిలదీయలేక.. నిస్సహాయంగా వెక్కి వెక్కి ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు (Police station) చేరుకున్నాడు. భార్య తనను కొడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది.

ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట వెక్కి వెక్కి ఏడవడం గమనించవచ్చు. అక్కడే ఉన్న పోలీస్ (Telangana Police) సిబ్బంది అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 'ఏడ్వకు.. ఏడ్వకు... పొద్దున రాపో... పెళ్లాలు కొడుతారు ఏం చేస్తాం... జమానా అలా అయిపోయింది...' అంటూ ఓ పోలీస్ సిబ్బంది అతన్ని సముదాయించాడు. అయినప్పటికీ అతను మాత్రం ఏడుపు ఆపలేదు. చిన్నపిల్లాడిలా కళ్ల నీళ్లు తుడుచుకుంటూ... వెక్కి వెక్కి ఏడుస్తూ... పోలీస్ స్టేషన్ నుంచి మళ్లీ ఇంటి బాట పట్టాడు. పాపం... ఇంటికెళ్లాక అతని భార్య మళ్లీ ఎలా రియాక్ట్ అయి ఉంటుందోనని.. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

భార్యా బాధితులు ఇలా పోలీస్ స్టేషన్లకు రావడం ఇదే మొదటిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో (Hyderabad) కొంతమంది భార్యా బాధితులు కలిసి ఒక సంఘం కూడా పెట్టారు. అప్పట్లో సుందరయ్య విజ్ఞాన భవన్‌లో దానిపై ఓ సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశం ద్వారా భార్యా బాధితుల బాధలు, ఆవేదనలు ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

Also Read: Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News