Vemulawada Hospital Kayakalpa Award: వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు

Vemulawada Hospital Gets Kayakalpa Award: వేములవాడ ఏరియా ఆసుపత్రి కాయకల్ప అవార్డు దక్కించుకుంది. స్థాపించిన అనంతరం ఏడాదిలోపే అవార్డు దక్కించుకున్న ఆస్పత్రిగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన వేములవాడ ఏరియా ఆసుపత్రిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 11:13 PM IST
  • వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు
  • ఏడాది క్రితమే స్థాపించిన వేములవాడ ఏరియా ఆస్పత్రి
  • రాష్ట్రంలో దాదాపుగా 100 ఏరియా ఆసుపత్రులు
Vemulawada Hospital Kayakalpa Award: వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు

Vemulawada Hospital Gets Kayakalpa Award: వేములవాడ ఏరియా ఆసుపత్రి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. ఏడాది క్రితమే స్థాపించిన వేములవాడ ఏరియా ఆస్పత్రి ఇక్కడి ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలకుగాను ప్రతిష్టాత్మకమైన కాయకల్ప అవార్డును దక్కించుకోవడం విశేషం. రాష్ట్రంలో దాదాపుగా 100 ఏరియా ఆసుపత్రులు ఉండగా.. ఈ జాబితాలోంచి మూడు అంచల విధానంలో ఆస్పత్రుల పనితీరును పరిశీలించి ఉత్తమ పని తీరు కనబర్చిన ఆస్పత్రిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 

ప్రధానంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవల్లో నాణ్యత, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, సిబ్బంది పని తీరు, వ్యర్ధాల సేకరణ, విద్యుత్ వినియోగం, పచ్చదనానికి ప్రాధాన్యత.. ఇలా దాదాపుగా 10 విభాగాల్లో ఆస్పత్రి పనితీరును పరిశీలించి మార్కులు ఇస్తారు. వంద మార్కులకుగాను వేములవాడ ఏరియా ఆసుపత్రి 89.14 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన ఏరియా ఆసుపత్రికి ప్రోత్సాహం కింద ప్రభుత్వం 7.50 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. 

ఈ నగదు బహుమతిని ఆస్పత్రి అభివృద్ధి నిమిత్తం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు మాట్లాడుతూ.. '' వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు రావడం సంతోషంగా ఉందని, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, కలెక్టర్ అనురాగ్ జయంతిల ప్రోత్సాహంతోనే తాము ఈ అవార్డును సాధించగలిగాం'' అని సిబ్బంది అందించిన సహకారం కూడా ఈ విజయంలో కీలకమైందని అన్నారు. కాయకల్ప అవార్డు మాపై మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.

Also Read : Minister Ktr: రైతుల ఆదాయ వివరాలు చూపండి..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్

Also Read : Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం..వాగులో కొట్టుకుపోయిన పడవ..!

Also Read : Telangana Bonalu 2022: సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలకు సర్వం సిద్ధం.. పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News