TSRTC As TGRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు మార్పు.. టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఆర్టీసీ

TSRTC Name Change As TGRTC: పేర్ల మార్పుపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో సంస్థ పేరు మార్చేసింది. రోడ్డు రవాణా సంస్థ పేరును టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఆర్టీసీగా మార్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 22, 2024, 09:12 PM IST
TSRTC As TGRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు మార్పు.. టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఆర్టీసీ

TSRTC As TGRTC: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరు మారింది. టీఎస్‌ఆర్టీసీ కాస్త టీజీఆర్టీసీగా పేరు మారుస్తూ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ల మార్పుపై దృష్టి సారించిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ల స్థానంలో టీఎస్‌ కాస్త టీజీగా మార్చారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యుత్‌ సంస్థ పేరు మారగా.. ఇప్పుడు ఆర్టీసీ పేరు మారింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు.

Also Read: KT Rama Rao: రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలి

 

ఈ సందర్భంగా ఆర్టీసీ సోషల్‌ మీడియా ఖాతాల పేర్లు కూడా మారాయి. TGRTCOffice, TGRTCHQ గా పేర్లు మారుస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సజ్జనార్‌ సూచించారు. ఇన్నాళ్లు కొనసాగించినట్టుగానే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయని.. పేర్లు మాత్రమే మారాయని ప్రకటించారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.

Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

'రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలైన TGRTCOffice, TGRTCHQ లను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను సంస్థ కోరుతోంది. టీజీఆర్‌టీసీ అందిస్తున్న సేవల గురించి తెలుసుకునేందుకు TGRTCMDOffice, TGRTCHQ ఖాతాలను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది' అని టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News