హైదరాబాద్: మేడారం సమ్మక్క - సారలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చిన కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాకి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలకు స్వాగతం పలికారు. అంతరం రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్- గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దర్శనం చేయించారు.
మేడారం జాతరను జాతీయ పండగ గా గుర్తించాలని, మేడారం అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం పోచంపల్లి కండువాలు, శాలువా కప్పి, జ్ఞాపికను అందించి సన్మానం చేశారు
మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాను మేడారంలో కలిసి వినతపత్రం అందజేశారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ...కేంద్ర సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.