Kishan Reddy: తెలంగాణలోనూ త్వరలో మహారాష్ట్ర సీన్? ఇక్కడి ఏకనాథ్ షిండే ఆయననేనా?

Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది

Written by - Srisailam | Last Updated : Jul 1, 2022, 03:29 PM IST
  • కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • తెలంగాణలోనూ మహారాష్ట్ర పరిస్థితులు
  • తెలంగాణలో ఏక్ నాథ్ షిండే ఎవరో?
Kishan Reddy: తెలంగాణలోనూ త్వరలో మహారాష్ట్ర సీన్? ఇక్కడి ఏకనాథ్ షిండే ఆయననేనా?

Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది. అందరని అంచనాలు తలకిందులు చేస్తూ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర ఎపిసోడ్ తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయనే చర్చలు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి మరింత కాక రాజేశారు.

తెలంగాణలోనూ త్వరలో మహారాష్ట్ర మాదిరిగానే పరిణామాలు జరుగుతాయంటూ హాట్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. పరేగ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ బీజేపీ అధికారంలోకి రాకుండా  ఆపడం ఎవరి తరం కాదన్నారు. కేసీఆర్ పతనం మొదలైందన్నారు కిషన్ రెడ్డి. పుత్ర వ్యాత్సల్యం వల్లే మహారాష్ట్రలో శివసేన చీలి పోయిందని అన్నారు. పుత్రుడికి పట్టాభిషేకం చేయాలిన చూస్తున్న కేసీఆర్ కు ఉద్దవ్ థాకరేకు పట్టిన గతే పడుతుందన్నారు. మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో సంచలనం జరగబోతోందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏకనాథ్ షిండే.. ఉద్దవ్ థాకరేపై సంచలన ఆరోపణలు చేశారు. శివసేన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరకడమే కష్టమైందన్నారు. దీనిపై మాట్లాడాలని తాను ప్రయత్నించినా ఉద్దవ్ సమయం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వంతో పార్టీలో నిర్ణయాలన్ని ఆదిత్య థాకరే డైరెక్షన్ లోనే జరిగాయన్నారు. రెండేళ్లుగా భరించిన ఎమ్మెల్యే సహనం నశించే తిరుగుబాటు చేశారన్నారు. తెలంగాణలో నూ సీఎం కేసీఆర్ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే టాక్ వస్తోంది. ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కావడమే ఎమ్మెల్యేలకు కష్టమనే వాదన ఉంది. మంత్రులు కూడా ప్రగతి భవన్ వరకు వెళ్లి అనుమతి లేక వెనుదిరిగి వస్తున్న పరిస్థితులు ఉన్నాయంటున్నారు. దీంతో మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో పరిణామాలు రావొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త కొత్త చర్చ తెరపైకి వస్తోంది.  తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కిషన్ రెడ్డి చెప్పినట్లు మహారాష్ట్ర తరహా పరిణామాలు జరిగితే.. తెలంగాణలో ఏక్ నాథ్ షిండే ఎవరు అన్నదే ప్రశ్నగా మారింది. గత ఏడాది మంత్రివర్గం నుంచి అవినీతి ఆరోపణలతో ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గ్రూప్ గా ఏర్పడే ప్రయత్నం చేసినందునే ఈటలను కేసీఆర్ పంపించి వేశారని.. అవినీతి ఆరోపణలు ఒక సాకు మాత్రమేననే టాక్ వచ్చింది. 2018 ఎన్నికల సమయంలోనే కేసీఆర్ పై ఈటల కుట్రలు చేశారని కొందరు గులాబీ నేతలు ఓపెన్ గానే చెప్పారు. ఈటల మరికొన్ని రోజులు టీఆర్ఎస్ లో ఉంటే ఏక్ నాథ్ షిండేలా తిరుగుబాటు చేసే అవకాశం ఉండేదని.. ఇప్పుడు ఈటల బయటికి రావడంతో అలాంటి పరిస్థితి ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వానికి మెజార్టీ భారీగా ఉంది. ప్రతిపక్ష పార్టీలకు సింగిల్ డిజిట్ లోనే సభ్యులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చీలికలు కష్టమనే వాదన వస్తోంది.

గతంలో మంత్రి హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. రెండోసారి గెలిచాక హరీష్ ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. హరీష్ ను కేసీఆర్ పక్కన పెట్టారని.. అవమానాలు భరించలేక హరీష్ రావు టీఆర్ఎస్ నుంచి బయటికి రాబోతున్నారనే ప్రచారం వచ్చింది. హరీష్ బయటికి వస్తే ఆయన వెంట నడిచేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. తర్వాత హరీష్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో ఆ వార్తలకు చెక్ పడింది. మళ్లీ హరీష్ రావు ఏమైనా తిరుగుబాటు చేసే అవకాశం ఉందా.. బీజేపీ ఆయనతో గేమ్ ఆడించవచ్చా అన్న అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. మరోవైపు రాజకీయాల్లో ఎదైనా జరగవచ్చని హరీషే కాదు మరోనేత కూడా ఎమ్మెల్యేలను కూడగట్టి తిరుగుబాటు చేసినా అశ్చర్యం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నందున మహారాష్ట్ర తరహా ప్రభుత్వం మార్పే పరిస్థితులు దాదాపు అసాధ్యమని.. కాని టీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు ఉండవచ్చనే అభిప్రాయమే మెజార్టీ రాజకీయ నిపుణుల నుంచి వస్తోంది. 

Read also: TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..బస్‌ టికెట్‌తోపాటే దర్శన టోకెన్..!

Read also: Amaravathi: అమరావతి ఉద్యోగులకు శుభవార్త..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News