Kishan Reddy: జాతీయ పార్టీ స్థాపన అనేది అతి పెద్ద జోక్..8వ నిజాం కేసీఆర్: కిషన్‌రెడ్డి..!

Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 12, 2022, 04:33 PM IST
  • సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ
  • త్వరలో పార్టీ స్థాపన
  • సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్
Kishan Reddy: జాతీయ పార్టీ స్థాపన అనేది అతి పెద్ద జోక్..8వ నిజాం కేసీఆర్: కిషన్‌రెడ్డి..!

Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన జాతీయ పార్టీ పెట్టడం అనేది..అతి పెద్ద జోక్‌ అని అన్నారు. ఉట్టికి ఎగరనోడు..ఆకాశానికి ఎగిరాడట అన్న చందంగా ఉందని విమర్శించారు. దళితులను సీఎం కేసీఆర్ దగ చేశారని మండిపడ్డారు. ఆయనకు పరిపాలించే సత్తా లేదన్నారు. ప్రధాని మోదీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని..కుటుంబ పార్టీలన్నింటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమకు ప్రజాస్వామ్య పాలన చేయడమే తెలుసని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. ఎప్పటికీ ఎన్డీఏకు కేసీఆర్ ప్రత్యామ్నాయం కానే కారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ది అతి పెద్ద అవినీతి కుటుంబమని..మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే..అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. 

మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాన్‌కో, జెన్‌కోకు రూ.40 వేల కోట్ల అప్పు ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో కేసీఆర్ అవినీతికి మీటర్లు పెడతామని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఏం చేశారని దేశవ్యాప్తంగా అలాంటి పాలన కావాలి అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. 

మజ్లిస్, ఎంఐఎంకు భయపడే పార్టీ బీజేపీ కాదన్నారు కిషన్‌రెడ్డి. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు కేసీఆర్ తాగుతున్నారని విమర్శించారు. ఈ పాలన దేశానికి అవసరమా అని మండిపడ్డారు. 8వ నిజాం కేసీఆర్ అని మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిణీ చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చెల్లని రూపాయి..అలాంటిది దేశంలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ఆయన విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. 

తెలంగాణ మోడల్ అంటే ఏంటో త్వరలో చూపిస్తామన్నారు. పాకిస్థాన్‌కు ఖాసీం రజ్వీ పారిపోయాడని..రజ్వీ చెంచాలను చంకలో పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ప్రగతి భవన్‌ నుంచి కేసీఆర్‌ను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు. లక్ష మంది కేసీఆర్‌లు, లక్షల మంది ఓవైసీలు వచ్చినా..2024లో వచ్చేది బీజేపీనేనని తేల్చి చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 

Also read:Vijayashanti: కేసీఆర్‌కు ప్రధాని పదవి రావడం పగటి కలే..విజయ శాంతి హాట్ కామెంట్స్..!

Also read:CM Jagan: ఇకపై ప్రతి స్కూల్‌లో ఇంటర్నెట్ సదుపాయం..విద్యా శాఖపై సీఎం జగన్ సమీక్ష..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News