Tamilisai Soundararajan about KCR: కేసీఆర్‌తో గ్యాప్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Governor Tamilisai Soundararajan about KCR: కేసీఆర్‌తో గ్యాప్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా స్పందించారు. తానెవరితో గ్యాప్ పెట్టుకోవాలని కోరుకోనన్నారు. గ్యాప్ గురించి కేసీఆర్‌నే అడగాలన్నారు. తాను ఇగోయిస్టును కాదంటూ పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 11:00 PM IST
Tamilisai Soundararajan about KCR: కేసీఆర్‌తో గ్యాప్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Governor Tamilisai Soundararajan about KCR: కేసీఆర్‌తో గ్యాప్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా స్పందించారు. తానెవరితో గ్యాప్ పెట్టుకోవాలని కోరుకోనన్నారు. గ్యాప్ గురించి కేసీఆర్‌నే అడగాలన్నారు. తాను ఇగోయిస్టును కాదంటూ పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించారు. తాను ఇగోయిస్ట్‌ను కాదని.. ఎనర్జిటిక్ గవర్నర్‌నని స్పష్టంచేశారు. ఉగాది వేడుకలకు అందరినీ ఆహ్వానించానని.. వచ్చిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. రాని వారి గురించి తాను బాధపడనని అన్నారు. తెలంగాణ ఆడపడచుగా తాను అందరికీ ఆహ్వానాలు పంపానన్నారు. 

సీఎం కేసీఆర్‌తో గ్యాప్ గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను చాలా ప్రెండ్లీ గవర్నర్‌నని ఎవరితో గ్యాప్ పెట్టుకోవాలని కోరుకోనని స్పష్టంచేశారు. గ్యాప్ గురించి కేసీఆర్‌నే అడగాలన్నారు. తన ఆహ్వానాలను వరుసగా పట్టించుకోకపోవడం చూస్తుంటే కేసీఆర్ నిజంగానే గ్యాప్ పెంచుకున్నట్లు అనిపిస్తుందన్నారు. అయితే దీనికి తాను బాధపడనన్నారు. అటు యాదాద్రి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా తాను అక్కడకు వెళ్లాలని కోరుకున్నట్లు తమిళిసై తెలిపారు. అయితే అధికారికంగా ఆహ్వానం అందకపోవడంతో వెళ్లలేకపోయినట్లు చెప్పారు. 

రాజ్ భవన్ తలుపులు సాధారణ జనం కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న గవర్నర్ తమిళిసై.. కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడానికి తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. ఉగాది సందర్భంగా రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినా సీఎం కేసీఆర్‌తో (Telangana CM KCR) పాటు మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవ్వరూ హాజరుకాలేదు.

Also read : Ugadi 2022: ఉగాది పండుగ పూట పాటించాల్సిన నియమాలు... చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే

Also read : Ugadi 2022: నూతన తెలుగు పంచాంగం ప్రకారం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News