తెలంగాణలో పరిస్థితిపై కన్నేసిన కేంద్రం ?

తెలంగాణలో పరిస్థితిపై కన్నేసిన కేంద్రం

Last Updated : Oct 8, 2019, 04:10 PM IST
తెలంగాణలో పరిస్థితిపై కన్నేసిన కేంద్రం ?

న్యూఢిల్లీ: తెలంగాణలో ఆర్టీసి కార్మికులు సమ్మె చేపట్టిన అనంతరం చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ 48 వేల మందికిపైగా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించిందనే వార్తలు జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కిన నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసినట్టు సమాచారం. 

తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులనే కాకుండా పలు ఇతర వర్గాలను కూడా రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా కేసీఆర్‌ సర్కార్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించినట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంశాఖకు నివేదికలు అందుతున్నాయని... అంతేకాకుండా మరోవైపు గవర్నర్‌ నుంచి సైతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివేదికలు కోరే అవకాశాలు లేకపోలేదనేది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తర్వాతి నిర్ణయాలు ఎలా ఉండనున్నాయా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Trending News