TSRTC Express Bus Pass: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ బస్‌పాస్‌లు

TSRTC Express Bus Pass: ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల రీత్యా నిత్యం ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రాకపోకలు సాగించే వారికి టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ తమకు రాయితీపై బస్ పాస్ సౌకర్యం ఉండి ఉంటే ఆర్థికంగా మేలు జరుగుతుంది కదా అని భావించే వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 06:32 PM IST
TSRTC Express Bus Pass: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ బస్‌పాస్‌లు

TSRTC Express Bus Pass: ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల రీత్యా నిత్యం ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రాకపోకలు సాగించే వారికి టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ తమకు రాయితీపై బస్ పాస్ సౌకర్యం ఉండి ఉంటే ఆర్థికంగా మేలు జరుగుతుంది కదా అని భావించే వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసిన టిఎస్ఆర్టీసీ... కిలోమీటర్ ఆధారంగా రుసుం వసూలు చేసేందుకు నడుం బిగించింది. అంతేకాకుండా టోల్‌ ప్లాజ్‌ రుసుం కూడా బస్‌పాస్‌తో పాటే వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ నుంచి సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్‌ తీసుకునే వారి నుంచి టోల్‌ప్లాజా చార్జీలను వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌ పాస్‌ చూపించి ఆ తరువాత ప్రతీ రోజూ ప్రత్యేకంగా టోల్‌ప్లాజా టికెట్‌ను వారు తీసుకోవాల్సి ఉండేది. అయితే, తాజాగా ఆ విధానానికి స్వస్తి పలికిన టిఎస్ఆర్టీసీ సంస్థ.. ఇక టోల్‌ ప్లాజా రుసుంను కూడా నెలవారీ బస్‌పాస్‌లోనేను మంజూరు చేయనుంది.

తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లు ఉన్నాయి. రెగ్యులర్‌గా 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి మంత్లీ సీజన్‌ టికెట్‌ పేరుతో టిఎస్ఆర్టీసీ అందిస్తోన్న కార్డులను నిత్యం ప్రయాణించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పాస్‌ తీసుకున్న వారికి సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీ లభిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే టికెట్ ధరలో మూడో వంతు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.

ఇక ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నెలవారీ బస్‌పాస్‌ల విషయానికొస్తే.. గతంలో ఇందులో శ్లాబ్‌ విధానం అమల్లో ఉండేది. కానీ ఇకమీదట శ్లాబ్ విధానంలో కాకుండా గమ్యస్థానం ఎన్ని కిలోమీటర్లు ఉంటే.. అన్ని కిలోమీటర్లకే బస్‌పాస్‌ను ఇచ్చే యోచనలో ఉంది. టిఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నెలవారీ బస్‌ పాస్ దారులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూర్చుతుంది" అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభిప్రాయపడ్డారు. ఈ సదుపాయాన్ని రెగ్యులర్‌‌‌గా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వారు సద్వినియోగం చేసుకోవాలని వీసీ సజ్జనార్ సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News