కార్మికులు విధుల్లో చేరతామని వచ్చినప్పటికీ.. తిరిగి వెనక్కి పంపిస్తున్నారా ?

నవంబర్ 5వ తేదీలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఆ తర్వాత విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదనేది సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి వార్నింగ్. అయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌కి భయపడి విధుల్లో చేరాలని కొంతమంది సిబ్బంది భావించినప్పటికీ.. వారిని తక్షణమే విధుల్లో చేర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం సంసిద్ధత కనబర్చడంలేదని తెలుస్తోంది. 

Last Updated : Nov 5, 2019, 12:25 AM IST
కార్మికులు విధుల్లో చేరతామని వచ్చినప్పటికీ.. తిరిగి వెనక్కి పంపిస్తున్నారా ?

హైదరాబాద్ : నవంబర్ 5వ తేదీలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఆ తర్వాత విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదనేది సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ఆఖరి వార్నింగ్. అయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌కి భయపడి విధుల్లో చేరాలని కొంతమంది సిబ్బంది భావించినప్పటికీ.. వారిని తక్షణమే విధుల్లో చేర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం సంసిద్ధత కనబర్చడంలేదని తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్ గడువు విధించినట్టుగానే ఐదవ తేదీలోగానే తాము విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ... వారిని విధుల్లోకి తీసుకునేది మాత్రం ఏడవ తేదీన కోర్టు తీర్పు వచ్చిన తర్వాతేనని చెబుతున్నట్టు సమాచారం. విధుల్లో చేరతామని వస్తోన్న కార్మికుల వద్ద నుంచి ప్రస్తుతానికి  ఫోటోలు, ఇతర వివరాలను తీసుకుంటున్న ఉన్నతాధికారులు.. ఏడవ తేదీ తర్వాతే తిరిగి రావాలని చెప్పి వెనక్కి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Trending News