TSRTC MD VC Sajjanar: సైదాబాద్ చిన్నారి హత్య కేసులో accused Raju కోసం రంగంలోకి దిగిన వీసీ సజ్జనార్

Saidabad six years old girl murder case latest updates : చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను కిరాతకంగా హతమార్చిన నిందితుడు రాజు పరారై రోజులు గ‌డుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవంతో నిందితుడిని గుర్తించి సమాచారం అందించిన వారికి రూ. 10 ల‌క్ష‌ల రివార్డు అందిస్తామంటూ నిందితుడు రాజు ఫోటోను (Saidabad girl murder case accused Photos) పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Written by - Pavan | Last Updated : Sep 15, 2021, 04:52 PM IST
  • సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం (Six year old girl murder case).
  • నిందితుడు రాజు (Saidabad girl murder case accused Raju photos) పట్టుకునేందుకు ఆర్టీసీ సిబ్బందిని అప్రమత్తం చేసిన వీసీ సజ్జనార్.
  • టిఎస్ఆర్టీసీ ఎండీ హోదాలోనూ కేసు విచారణలో తన వంతు పాత్ర పోషిస్తున్న వీసీ సజ్జనార్ (TSRTC MD VC Sajjanar)
TSRTC MD VC Sajjanar: సైదాబాద్ చిన్నారి హత్య కేసులో accused Raju కోసం రంగంలోకి దిగిన వీసీ సజ్జనార్

Saidabad six years old girl murder case latest updates: సైదాబాద్ సింగరేణిలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలికలపై, మహిళలపై లైంగిక వేధింపుల కేసులను డీల్ చేయడంలో దూకుడు కలిగిన ఆఫీసర్‌గా పేరున్న సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్ ఈ కేసు దర్యాప్తులో పరోక్షంగా రంగంలోకి దిగారు. బాలికపై హత్యాచారానికి (Six years old girl murder case) పాల్పడి హతమార్చిన నిందితుడు రాజు ఆర్టీసీ బస్ స్టేషన్స్‌లో షెల్టర్ తీసుకునే అవకాశం ఉందని సందేహం వ్యక్తంచేసిన వీసీ సజ్జనార్.. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిందితుడిని గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించాలని సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందికి (TSRTC staff) సూచించారు. ఒకవేళ నిందితుడిని గుర్తించినట్టయితే.. వెంటనే 9390616366, 9490616627 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో బస్టాండ్లలో నిద్రపోయే అవకాశం ఉందని, లేదా బస్సుల్లోనే ప్రయాణించే అవకాశం కూడా లేకపోలేదని సజ్జనార్ అనుమానం వ్యక్తంచేశారు.

Also read : Saidabad Girl Case: సైదాబాద్‌ బాలిక కేసులో కీలక నిర్ణయం, నిందితుడిని పట్టించిన వారికి పెద్ద మొత్తంలో రివార్డ్

ప్రతీ బ‌స్సులో, బస్ స్టేషన్స్‌లో నిందితుడి ఫోటోను పెట్టాలని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించారు. '' ఆర్టీసీ డ్రైవర్లు, కండ‌క్ట‌ర్లతో పాటు సిబ్బంది అంతా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. నిందితుడి క‌ద‌లిక‌లు ఉన్నట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసుల‌కు సమాచారం అందించాలని.. అలాగే 94906 16366, 94906 16627 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలి'' అని సజ్జనార్ (TSRTC MD VC Sajjanar) సూచనలు జారీచేశారు.

చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను కిరాతకంగా హతమార్చిన నిందితుడు రాజు పరారై రోజులు గ‌డుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవంతో నిందితుడిని గుర్తించి సమాచారం అందించిన వారికి రూ. 10 ల‌క్ష‌ల రివార్డు అందిస్తామంటూ నిందితుడు రాజు ఫోటోను (Saidabad girl murder case accused Photos) పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టిఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ కూడా తన వంతు బాధ్యతగా ఈ ప్రకటన చేశారు.

Also read : Singareni Colony Girl Incident : సైదాబాద్ సింగరేణి కాలనీ బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు మంచు మనోజ్‌ పరామర్శ, నిందితుడ్ని వదలకూడదని డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News