TSRTC fares hiked | టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

టిఎస్ఆర్టీసీ(TSRTC) సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(TSRTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని తేల్చేశారు.

Last Updated : Nov 29, 2019, 07:30 AM IST
TSRTC fares hiked | టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడిన తర్వాత రెండోసారి బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం(Telangana govt) నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులను శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా కోరుతూ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ(TSRTC) తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్టీసీ ఛార్జీలు(RTC fares) పెంచితే కానీ సంస్థ మనుగడ కష్టం అని చెప్పి ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. కిలోమీటర్‌కి 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దీంతో ఇకపై ప్రతీ 5 కిమీ రూ.1 చొప్పున, అలాగే ప్రతీ 100 కిమీ దూరం ప్రయాణానికి సుమారు రూ20 చొప్పున ఛార్జీల ధరలు పెరగనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం ఒక్కసారే బస్సు ఛార్జీలు పెరిగాయి. 2016 జూన్‌లో 8.77% మేర ఛార్జీలు పెంచుతూ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకు ఆర్టీసీ ఛార్జీలు పెరగడం ఇదే తొలిసారి. 

Read also : టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?

తెలంగాణ సర్కార్ తీసుకున్న తాజా  నిర్ణయంతో ప్రయాణికులపై ఏడాదికి రూ.752 కోట్ల మేర భారం పడనుంది. ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సంస్థను కొనసాగించాలంటే.. ప్రయాణికులు ఆ భారాన్ని మోయకతప్పదని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు.

Trending News