వీఆర్వో పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

వీఆర్వో పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Last Updated : Sep 11, 2018, 02:18 PM IST
వీఆర్వో పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. tspsc.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు హాల్‌టికెట్లను పొందవచ్చని అధికారులు తెలిపారు.

తెలంగాణలో 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా రికార్డు స్థాయిలో 10.58 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హత కాగా.. ఉన్నత చదువులు చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 16న వీఆర్వో పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుంది. హాల్‌టికెట్ ఉంటేనే పరీక్షా హాలులోకి అభ్యర్థులను అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు ఈ క్రింది విధంగా హాల్‌టికెట్లను పొందవచ్చు:

  • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అధికారిక వెబ్ సైట్ tspsc.gov.inలోకి వెళ్ళండి. 
  • టీఎస్‌పీఎస్సీ హోమ్ పేజీలో 'టీఎస్‌పీఎస్సీ వీఆర్వో హాల్ టికెట్' అనే డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి 'గో' బటన్ పై క్లిక్ చేయండి లేదా డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • వీఆర్వో హాల్‌టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Trending News