Telangana Intermediate Results 2022 likely to release June 15: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 24తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో వేగం పెంచారు. రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది. ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
జూన్ రెండో వారం చివరి నాటికి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జూన్ 15 నాటికి ఇంటర్ ఫలితాలని ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ వారం రోజుల్లో పరీక్ష ఫలితాలు వెలుబడనున్నాయి. అయితే దీనిపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విద్యార్థులు ఫలితాల కోసం tsbie.cgg.gov.in వెబ్ సైట్‌ను క్లిక్ చేయండి.
ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇప్పటికే బోర్డు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. 221 పని రోజులతో వచ్చే విద్యా సంవత్సరాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. తరగతులు, పరీక్షలు, సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది.
జూలై 1న ఇంటర్ ఫస్టియర్ తరగతులు, జూన్ 15న సెకండియర్ తరగతులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులు కాగా.. 2023 జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రి ఫైనల్ పరీక్షలు ఉండగా.. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ వరకు వార్షిక పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ ఒకటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు. జూన్ 1 కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
Also Read: Nayanthara-Vignesh Wedding: మేడమ్ నుంచి.. సతీమణి అయ్యారు! నయనతార అనుబంధంపై విఘ్నేశ్ పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook