Telangana Inter Results 2023 Date: ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే రెండో వారంలో ఫలితాలు వెల్లడవుతాయని ముందుగా ప్రచారం జరగ్గా.. తాజాగా మరో డేట్ తెరపైకి వచ్చింది. మే 10వ తేదీన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే షిప్టులో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం స్పాట్ వాల్యూవేషన్ కూడా దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. ఎంసెట్, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విద్యార్థులు ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ 'T App Folio'లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
==> ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inను సందర్శించండి.
==> హోమ్ పేజీలో ఉన్న టీఎస్ ఇంటర్ ఫలితాలు 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
==> ఇక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి
==> ఫలితాలను చెక్ చేసుకుని..పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి
==> భవిష్యత్ అవసరాల కోసం మార్కుల జాబితాను ప్రింట్ తీసుకుంటే ఉత్తమం.
ఫలితాలు ఇలా వస్తాయి..
==> విద్యార్థి పేరు:
==> హాల్ టికెట్ నంబర్:
==> మొత్తం మార్కులు:
==> ఫలితం/గ్రేడ్:
==> సబ్జెక్ట్ వారీగా మార్కులు, గ్రేడ్:
Also Read: YS Sharmila: మాకు నమ్మకం లేదు దొరా.. సిట్‌తోనే మమ అనిపిస్తున్నారు: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook