TS Inter Board: తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు అస్సలు పట్టించుకోవనే టాక్ ఉంది. ఫీజులు సహా ఇతర విషయాల్లో ప్రభుత్వం ఎన్ని జోవోలు ఇచ్చినా ప్రైవేట్ కాలేజీలకు వర్తించవనేలా సీన్ మారిపోయింది. తాజాగా దసరా సెలవుల విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ విషయంలోనే ఇంటర్ బోర్డు సీరియస్ గా స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.
విజయదశమి సందర్భంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రాధమిక విద్యాశాఖ తమ పరిధిలోని అన్ని రకాల విద్యా సంస్థలకు సెప్టెంబర్ 25 నుంచే సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 10న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి 9 వరకు సెలవులు ఇచ్చారు. కాని కొన్ని ప్రైవేట్ కాలేజీలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. సెలవులు ప్రకటించకుండా క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీనిపై ఇంటర్ బోర్డుకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీల క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా క్లాస్‌లు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తా అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సంబంధిత కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాల్ పై కూడా చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.
Read also: KCR NEW PARTY: కేసీఆర్ పార్టీ లీక్స్.. భారత రాష్ట్ర సమితి కాదట.. కొత్త పేరు ఇదేనట?
Read also: Sajjanar Car Accident: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు.. పలువురికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి