తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ ఎంసెట్‌-2018 పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది.

Last Updated : May 9, 2018, 10:09 AM IST
తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ ఎంసెట్‌-2018 పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష సజావుగా సాగిందని అధికారులు పేర్కొన్నారు. కాగా టీఎస్ ఎంసెట్-2018 (తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ తదితర) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రాథమిక కీ ని జేఎన్టీయూ హైదరాబాద్ మంగళవారం మే 8, 2018న విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మే 10, 2018 సాయంత్రం 6 గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెస్పాన్స్ షీట్‌లను అభ్యర్థుల ఈ మెయిల్స్‌కు ప్రాథమిక కీ విడుదల చేసిన తేదీ నుంచే పంపించే ఏర్పాటు చేశారు.

అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీ ప్రకటిస్తామన్నారు. మే 18న ఎంసెట్ ఫలితాలు వెల్లడికావొచ్చని సూచనప్రాయంగా కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య వెల్లడించారు. ఆన్‌లైన్ విధానం కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ.. అందువల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని.. పరీక్ష పూర్తి అయిన 10 రోజుల్లోనే ఫలితాలు ఇవ్వడం సాధ్యమవుతుంటే అందుకు ఆన్‌లైన్ పరీక్షా విధానమే కారణమన్నారు. తద్వారా విద్యార్ధులు త్వరగా కళాశాలల్లో ప్రవేశించవచ్చని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 2 ప్రారంభమైన ఆన్‌లైన్ టీఎస్ ఎంసెట్ పరీక్షలు మే 7 సోమవారం ముగిశాయి. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 63,653 మంది దరఖాస్తులు చేసుకోగా 58,744 మంది విద్యార్థులు పరీక్షలకు (92.29 శాతం) హాజరయ్యారని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,26,547 మంది దరఖాస్తులు చేసుకోగా 1,19,270 మంది పరీక్షలకు (94.25 శాతం) హాజరయ్యారని ఆయన వెల్లడించారు.

టీఎస్ ఎంసెట్-2018 ఆన్సర్ కీ:

  • అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.inకి వెళ్లండి.
  • హోం పేజీలో టీఎస్ ఎంసెట్ 2018 ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేసి మీకు వచ్చిన స్లాట్స్ ప్రకారం ఆన్సర్ కీ ని చెక్ చేసుకోండి.

Trending News