TS COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34,764 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 156 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 55 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, మరోవైపు గత 24 గంటల్లో 155 మంది కరోనా వైరస్ నుంచి (COVID-19) కోలుకోగా, ఒకరు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల మొత్తం 6,75,001 కి చేరుకుంది. అలాగే 6,67,483 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో పోరాడి కన్నుమూసిన వారి సంఖ్య 3,985కి పెరిగింది.
Also read: How Prevent Lower Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు ఇలా చేస్తే నడుము నొప్పి మాయం!
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 3,533 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో వ్యాధి లక్షణాలు (Coronavirus symptoms) తీవ్రంగా ఉన్న వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగతా వారు ఇంట్లోనే క్వారంటైన్ అవుతూ చికిత్స తీసుకుంటున్నారు.
Also read : మజ్జిగ ఇలా రోజూ తాగితే..బరువు తగ్గుతారని మీలో ఎంతమందికి తెలుసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook