రాహుల్‌తో టీఆర్ఎస్ రెబల్ ఎంపీ భేటీ ; కాంగ్రెస్ లో చేరికపై సమాలోచనలు

                                     

Last Updated : Nov 21, 2018, 12:09 PM IST
రాహుల్‌తో టీఆర్ఎస్ రెబల్ ఎంపీ భేటీ ; కాంగ్రెస్ లో చేరికపై సమాలోచనలు

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.  ఈ భేటీలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. తాను టీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా రాహుల్ కు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా కూడా ఉన్నారు. ఉదయం విశ్వేశ్వర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతో కలసి  రాహుల్ నివాసానికి వెళ్లారు. 

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునునేందు ముహుర్త ఖరారు
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్ మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ ల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా జిల్లాకు చెందిన మంత్రి మహేందర్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తనకు లెక్కచేయడం లేదని టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న  విశ్వేశ్వర్ రెడ్డి  నిన్ననే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడటానికి కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖను  రాశారు. ఇలా టీఆర్ఎస్ కు గడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు విశ్వేశ్వర్ రెడ్డి.

Trending News