MP SON ROBBED: టీఆర్ఎస్ ఎంపీ కొడుకు దారి దోపిడి.. హైదరాబాద్ లో ఇంత అరాచకమా!

Nama Prithvi Teja: హైదరాబాద్ లో మరో అరాచకం జరిగింది. అధికార పార్టీ ఎంపీ కొడుకు దారి దోపిడికి గురి కావడం ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది.. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 2, 2022, 12:09 PM IST
  • హైదరాబాద్ లో మరో దారుణం
  • ఎంపీ నామా కొడుకు దారి దోపిడి
  • కారును అడ్డగించిన దుండగులు
MP SON ROBBED: టీఆర్ఎస్ ఎంపీ కొడుకు దారి దోపిడి.. హైదరాబాద్ లో ఇంత అరాచకమా!

Nama Prithvi Teja: హైదరాబాద్ లో వరుసగా అరాచకాలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇస్మాయిల్ అనే రౌడీ షీటర్ ను అతని స్నేహితుడే గన్ తో కాల్చి చంపాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. కత్తి, పిస్టల్ తో బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ రెండు ఘటనలు జరిగిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ లో మరో అరాచకం జరిగింది. నగరంలోనే అధికార పార్టీ ఎంపీ కొడుకు దారి దోపిడికి గురి కావడం ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది.. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

టీఆర్ఎస్ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీతేజ వ్యాపారవేత్త. జూబ్లీహిల్స్ ఉంటారు. ఆయన కారులో వెళుతుండగా టోలీ చౌకీలో దుండగులు అడ్డగించారు. పృథ్వీతేజను బెదిరించి కారులో ఎక్కారు. తర్వాత అతని మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఆన్ లైన్ లో  75 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు దుండగులు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఎంపీ నామా కుమారుడి ఫిర్యాదుతో  పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పృథ్వీతేజ కారులో వెళుతుండగా టోలీచౌకీలో కారుకు బైక్​ను అడ్డం పెట్టి ఆపారు ఇద్దరు దుండగులు. వెంటనే కారు ఎక్కారు. తర్వాత డ్రైవర్ సీటులో ఉన్న పృథ్వీతేజ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. కారును కొండాపూర్ వైపు మళ్లించారు. మధ్యలో మరో ఇద్దరు దండగులు కారు ఎక్కారు. గచ్చిబౌలిలోని ఓ వైన్స్ వద్ద కారును ఆపి మద్యం తాగారు. అక్కడి నుంచి కొండాపూర్ వెళ్తుండగా మరో దుండగుడు కారు ఎక్కాడు. ఐదుగురు కలిసి కారులోనే పృథ్వీతేజపై దాడి చేశారు. పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టారు. డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో 75 వేల రూపాయలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశాడు పృథ్వీతేజ. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా పృథ్వీతేజ వ్యక్తిగత సిబ్బంది సోమవారం సాయంత్రం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు

అధికార పార్టీ ఎంపీ కొడుకు కారును అడ్డగించి.. అతడిని బెదిరించి డబ్బులు వసూల్ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కారులో దుండగులు సిటీ మొత్తం తిరుగుతున్నా పోలీసులు గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.అదే సమయంలో ఘటనపైనా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగితే సోమవారం సాయంత్రం వరకు ఎంపీ కొడుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. పృథ్వీతేజ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  

Also Read: Elachi Remedies for Money: ఇలాచీ పరిహారాలు.. ఇలా చేస్తే డబ్బే డబ్బు, మనీ కష్టాలన్నీ మాయం

Also Read : Rohit Sharma: అందుకే అవేశ్‌ ఖాన్‌కు చివరి ఇచ్చా.. విమర్శలపై స్పందించిన రోహిత్ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News