Padma Rao: తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా? పార్టీ మార్పుపై పద్మారావు సంచలన ప్రకటన...

Padma Rao : మునుగోడు తర్వాత తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీంతో మరో ఎమ్మెల్యే కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారం సాగింది. ఇంతలోనే పద్మారావు ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లి అతనితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చి వైరల్ గా మారాయి.

Written by - Srisailam | Last Updated : Oct 19, 2022, 03:39 PM IST
  • పద్మారావు పార్టీ మారుతున్నారని ప్రచారం
  • కిషన్ రెడ్డి, పద్మారావు వీడియో వైరల్
  • పార్టీ మారే సమస్యే లేదన్న పద్మారావు
Padma Rao: తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా? పార్టీ మార్పుపై పద్మారావు సంచలన ప్రకటన...

Padma Rao: తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మారడటంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు శ్రమిస్తున్నాయి. ఈ సమయంలోనే రెండు రోజులుగా మరో వార్త తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ... టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మునుగోడు తర్వాత తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీంతో మరో ఎమ్మెల్యే కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారం సాగింది. ఇంతలోనే పద్మారావు ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లి అతనితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చి వైరల్ గా మారాయి. దీంతో బీజేపీలో చేరికపైనే కిషన్ రెడ్డితో పద్మారావు చర్చలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. పద్మారావు కాషాయ కండువా కప్పుకుంటారన్న వార్తలు అధికార పార్టీలో కలకలం రేపాయి.

పార్టీ మారుతున్నానంటూ తనపై వస్తున్న వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్న మాటల పచ్చి అబద్దమన్నారు. తనపై కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారన ఆరోపించారు. తమ ఊపిరి ఉన్నంత కాలం టీఆర్ఎస్ ను వీడేది లేదని పద్మారావు స్పష్టం చేశారు. గులాబీ పార్టీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.తాను కిషన్ రెడ్డితో చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు ఫేక్ అన్నారు. ఇటీవల కాలంలో తాను కిషన్ రెడ్డిని కలవలేదన్నారు. తన కుమారుడి పెళ్లి సమయంలో కిషన్ రెడ్డి తన ఇంటికి వచ్చిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని పద్మారావు మండిపడ్డారు.

ఉద్యమ కాలం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని నడిపింది తానే అన్నారు పద్మారావు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన తాను కూడా పార్టీ మారుతున్నానని పుకార్లు సృష్టించడం సరికాదన్నారు. ఇంతకాలం బూర నర్సయ్య కు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని పద్మారావు నిలదీశారు. ఎంపీగా ఉన్నపుడు ఆత్మగౌరవం ఎటు పోయిందని ప్రశ్నించారు. తాను ఎవరిని మోసం చేయలేదని.. చేశానని నిరూపిస్తే  పదవికి రాజీనామ చేస్తానని పద్మారావు సవాల్ విసిరారు.ప్రగతి భవన్ కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. సీఆర్ తోనూ తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు పద్మారావు.

తాను పద్మారావుతో సమావేశం అయినట్లు వైరల్ అవుతున్న వీడియోపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ఆ వీడియో పాతదని చెప్పారు. పద్మారావు కుమారుడి పెళ్లికి తాను వెళ్లలేకపోయానన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంటికి వెళ్లి ఆశీర్వదించి వచ్చానని తెలిపారు. పాత వీడియోను బయటికి తీసి ప్రచారం చేయడం సరికాదన్నారు పద్మారావు గౌడ్.

Read also: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్.. వైసీపీ నుంచి సస్పెండ్.. హిట్ లిస్టులో ఇంకెవరు..?

Read also: AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పగ్గాలు.. కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News