BJP VS TRS: అమిత్ షాకు షాకిచ్చిన టీఆర్ఎస్.. సెప్టెంబర్17న రచ్చ రచ్చేనా?

BJP VS TRS:  తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటుతోంది. సోషల్ మీడియా రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ కూడా సాగుతోంది.

Written by - Srisailam | Last Updated : Sep 15, 2022, 08:27 AM IST
BJP VS TRS: అమిత్ షాకు షాకిచ్చిన టీఆర్ఎస్.. సెప్టెంబర్17న రచ్చ రచ్చేనా?

BJP VS TRS:  తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటుతోంది. సోషల్ మీడియా రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ కూడా సాగుతోంది. తాజాగా సెప్టెంబర్ 17 కేంద్రంగా గులాబీ, కాషాయ పార్టీల మధ్య యుద్ధం సాగుతోంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోంది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర సాంస్కృతిక శాఖ. బీజేపీకి కౌంటర్ గా తెలంగాణ సర్కార్ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలతో పాటు ఎన్టీఆర్ స్టేడియంలో సభ నిర్వహిస్తోంది. సమైక్యతా వేడుకలకు తెలంగాణ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్ 17నే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్ పోటాపోటీ కార్యక్రమాలు ఉండగా.. ఏర్పాట్లు పోటాపోటీగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో మరోసారి బిజేపీ, టిఆర్ఎస్ మధ్య ప్లెక్సీల వార్ సాగుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి షాకిచ్చింది తెలంగాణ సర్కార్.  పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న అమిత్ షా  విమోచన దినోత్సవ సభపై టిఆర్ఎస్ ప్రకటనల ఎఫెక్ట్ పడింది. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ప్రకటనల కోసం మెట్రో పిల్లర్లను ముందస్తుగా బుక్ చేసుకుంది టిఆర్ఎస్ సర్కార్. నగరంలో విమోచన దినోత్సవానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలకు ఛాన్స్ లేకుండా మొత్తం మెట్రో పిల్లర్లను బుక్ చేసుకుంది. ఈ మేరకు ఎల్అండ్ టీ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ లతో వారం రోజులు ముందుగానే  డీల్ చేసుకుంది.

హైదరాబాద్ లో మొత్తం 2100 లకు పైగా మెట్రో పిల్లర్లు ఉండగా.. వాటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం చేయబోతోంది. నగరంలోని వెయ్యికి పైగా బస్టాప్ లపైనా ప్రకటనలు పెడుతోంది కేసీఆర్ సర్కార్.  మెట్రో పిల్లర్లను టీఆర్ఎస్ బుక్ చేసుకోవడంతో.. గత్యంతరం లేక వాల్ పోస్టర్లతో బిజేపి ప్రచారం చేస్తోంది.  పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో అమిత్ షా సభ, విమోచన దినోత్సవంపై వాల్ స్టికర్స్ పెట్టింది. ఎవరూ తొలగించడానికి వీలు లేకుండా డిజిటల్ స్టికర్స్ ఏర్పాటు చేసింది కేంద్ర సాంస్కృతిక శాఖ. టీఆర్ఎస్ వ్యూహంతో కేంద్ర ప్రభుత్వ సభకు సంబంధించిన ప్రచారం కూడా చేసుకోలేకపోతోంది బీజేపీ. ఇక సెప్టెంబర్ 17న పోటాపోటీ సభలు ఉండటంతో ఆ రోజున ఏం జరగబోతుందన్న ఆందోళన నగరవాసుల్లో కనిపిస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోస్ట్‌లు పెడితే కౌంటర్ గా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతోంది. అయితే సంజయ్ యాత్ర సాగే మార్గాల్లో బీజేపీ పోస్టర్ల పక్కన కంటోన్మెంట్ యువత పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు.  ఐటీఐఆర్, మెడికల్ కాలేజీలు, ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను ప్రస్తావించారు.

Also read: AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News