Traffic Diversions in Hyderabad: రేపు దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. మంగళవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించలేదు. నెలవంక కనిపించినట్లు ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదని.. దీంతో రేపు అంటే ఏప్రిల్ 11న ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ తెలిపింది. దీంతో బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని కమిటీ సూచించింది. పండుగను శాంతిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం హుస్సేనీ సజ్జాద్పా కోరారు. ప్రజలందరికీ కమిటీ తరుఫున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాతబస్తీతోపాటు వేర్వేరు మసీదులు, ఈద్గాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని చెప్పారు. మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని.. వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
==> పురాణాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గాలోని ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలు బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ మీదుగా రావాల్సి ఉంటుంది.
==> ఇతర వాహనదారులు తాడ్బన్ మీదుగా వెళ్లాలి.
==> శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి వచ్చే వారు.. దానమ్మ హట్స్ క్రాస్ రోడ్స్ వద్ద శాస్త్రీపురం, నవాబ్ సాహెబ్ కుంట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
==> కాలాపత్తర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వైపు ఇతర వాహనాలకు అనుమతి లేదు.
==> కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ వద్ద మోచీకాలనీ, బహదూర్‌పురా, శంషీర్‌గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు వాహనాలను మళ్లిస్తారు.
==> పురాణాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే RTC బస్సులు, ఇతర హెవీ వెహికిల్స్‌ను పురాణాపూల్ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ మీదుగా మళ్లిస్తారు.
==> శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద డైవర్ట్ చేస్తారు.
==> మాసబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ వద్ద గురువారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
==> మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, అయోధ్య జంక్షన్ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
Also Read: Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook