తెలంగాణలో కరోనాతో మరో ఆరుగురు మృతి

తెలంగాణలో శనివారం కొత్తగా మరో 74 కరోనా పాజిటివ్‌ కేసులు ( coronavirus positive cases ) నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,499కు చేరుకుంది.

Last Updated : May 31, 2020, 10:25 AM IST
తెలంగాణలో కరోనాతో మరో ఆరుగురు మృతి

హైదరాబాద్‌ : తెలంగాణలో శనివారం కొత్తగా మరో 74 కరోనా పాజిటివ్‌ కేసులు ( coronavirus positive cases ) నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,499కు చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం 2,499 కేసుల్లో తెలంగాణకు చెందిన కేసులు 2,068 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులు ( Migrant workers ), సౌదీ అరేబియా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకిన కేసులు 431 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు 189 మంది వలసకూలీలు కరోనా బారినపడ్డారు. 

కరోనా కాటుతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య 77 కి ( COVID-19 death toll ) చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 1,412 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం మరో 1,010 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని వనపర్తి జిల్లాలో శనివారం ఒక కేసు నమోదైనట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. వరంగల్‌ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలంగాణ సర్కార్ ( Telangana govt ) తమ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అయితే, ఈ రెండు జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనప్పటికీ... వారంతా వేరే రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి స్వస్థలాలకు తిరిగొచ్చిన వారే కావడంతో వారిని ప్రభుత్వం వలసకూలీలు, విదేశాల నుంచి తిరిగొచ్చిన వారి జాబితాలో చేర్చడం గమనార్హం. 

ఇక సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట, భద్రాద్రి-కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల, నల్లగొండ, జనగాం, మహబూబాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదని సర్కార్ స్పష్టంచేసింది.

Trending News