TSRTC OFFER: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల పట్టించడంతో పాటు ప్రజలకు మరింత చేరువ కావడానికి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంస్థలో కొత్త ఒరవడి మొదలైంది. ఆర్టీసీపై తనదైన ముద్ర వేస్తున్న సజ్జనార్.. ఇప్పటికే పలు నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధించారు. సందర్భాన్ని బట్టి ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ ఆదాయం పెరగడానికి దోహదపడ్డారు. ఫెస్టివల్స్, హాలీ డేస్ రోజుల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణాలపై ఆఫర్స్ ప్రకటిచారు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాంగ్ జర్నీకి సంబంధించి రిజర్వేషన్ విధానంలో ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించబోతోంది. బస్సు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేలా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బస్సు స్టార్ట్ కావడానికి గంటకు ముందు వరకే టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇకపై బస్సు బయలుదేరడానికి 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే విధానం తీసుకువస్తామని తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ , ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.ప్రస్తుతం బస్సులో సీటు ఖాళీగా ఉంటే.. డ్రైవర్ లేదా కండక్టర్ తో మాట్లాడి నేరుగా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇకపై ఆ సీట్లకు కూడా రిజర్వేషన్ చేసుకునే అవకాశం రాబోతోంది.
దూర ప్రాంతం వెళ్లే బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే.. జర్నీ స్టార్ట్ కావడానికి 15 నిముషాల ముందు కూడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ కొనవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వెబ్ సైట్ లో మార్పులు చేయబోతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఇందుకోసం ఉపయోగించాలని టీఎస్ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించింది. తొలి దశలో 928 మిషన్లను కొలుగోలు చేయనున్నారు. వెబ్ సైట్ అప్ గ్రేడ్ అయిన వెంటనే ఈ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో స్మార్ట్ కార్డును తీసుకురానున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ కార్డు ద్వారా ప్యాసింజర్స్ కు రివార్డు పాయింట్స్ ఇవ్వనున్నారు. వాటిని తర్వాత క్యాష్ గా మార్చుకుని.. టికెట్ తీసుకోవచ్చు.
ఈ వారంలోనే హైదరాబాద్ నగరవాసులకు టీఆర్ఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ పరిధిలో రాత్రంతా బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రాత్రి 10, 11 గంటల వరకు మాత్రమే సిటీ బస్సులు తిరుగుతున్నాయి. తెల్లవారుజామున 4, 5 గంటలకు తిరిగి తమ సేవలను ప్రారంభిస్తున్నాయి. అయితే ఇకపై కొన్ని రూట్లలో అర్ధరాత్రి కూడా బస్సులు ఉండేలా ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్-పటాన్ చెరు, సికింద్రాబాద్-చార్మినార్, సికింద్రాబాద్-సీబీఎస్ మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు.దూర ప్రాంతాలకు రాత్రి వేళ్లలో రైలు, ఇతర మార్గాల ద్వారా హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు... రాత్రి వేళ్లలో తమ గమ్యస్థానాలకు చేరడానికి పడుతున్న ఇబ్బందులకు చెక్ పట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్ ప్రకటించారు. ఇక ఈ నెల 23 నుంచి జరగుతున్న పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఫ్గీ జర్నీ అవకాశం కల్పించారు సజ్జనార్.
READ ALSO: TDP MAHANADU: పొత్తులపై టీడీపీ మహానాడులో కీలక తీర్మానం? అమలాపురం అల్లర్లపై ప్రత్యేక చర్చ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook