Dusshera Liquor Sales: తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగింది. కుటుంబసభ్యులతోపాటు బంధుమిత్రులు ఒక్క చోట కలుసుకుని జమ్మి ఇచ్చుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం బంధుమిత్రులు మద్యం సేవించి ఆనందంలో మునిగారు. ఈ సందర్భంగా దసరా పండుగకు భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. వారం ముందే నుంచే మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. ఇక పండుగ రోజు ఊపిరి సలపనంత బిజీగా అయిపోయింది. అయితే ఇదే విషయాన్ని గమనించి ఓ దొంగ మద్యం దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. దుకాణంలోకి రూ.12 లక్షల నగదు దొంగతనానికి పాల్పడిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. దొంగతనానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read: Taps Stolen: సర్కార్ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీ
నల్లగొండ జిల్లా గుర్రంపోడులో ఆదిత్య వైన్స్ ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మద్యం దుకాణంలో భారీగా మద్యం వ్యాపారం సాగింది. దసరా పండుగ రోజు శనివారం భారీగా విక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఓ దొంగ పండుగ రోజు అర్ధరాత్రి వైన్స్‌లోకి దూకాడు. పైకప్పు రేకులను పగలగొట్టి లోపలికి దూకి మొత్తం గమనించాడు. దుకాణంలోకి ప్రవేశించిన దుండగుడు గల్లా పెట్టెలో చూశాడు. మొత్తం నోట్ల కట్టలు కనిపించడంతో సంబరపడ్డాడు.
Also Read: GN Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో తుదిశ్వాస
గల్లా పెట్టెలో భారీగా నగదు కనిపించడంతో దొంగతనానికి పాల్పడ్డాడు. ఉదయం దుకాణం తెరిచి చూడగా చిందరవందరగా వస్తువులు పడడం.. పైకప్పు కూలిపోవడం చూశాడు. వెంటనే గల్లా పెట్టె చూడగా నగదు కనిపించలేదు. చోరీకి గురయిందని గ్రహించి వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.12 లక్షల నగదు దొంగతనానికి గురయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ కూడా సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే బ్యాంకుకు సెలవు కావడంతో నగదును డిపాజిట్ చేయకుండా దుకాణంలో ఉంచినట్లు యజమాని తెలిపారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇది తెలిసినవారి పనే అని యజమాని అనుమానిస్తున్నాడు. పోలీసులు వెంటనే కేసును పరిష్కరించాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా దొంగ కోసం గాలిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి