తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం!

ఆర్టీసీ బస్సులో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఘటన

Last Updated : Oct 18, 2019, 08:19 PM IST
తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం!

మంచిర్యాల: ఆర్టీసీ బస్సులో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్లిన బస్సు తిరిగి రాత్రి 7-8 గంటల ప్రాంతంలో చెన్నూరు నుంచి మంచిర్యాలకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తాత్కాలిక కండక్టర్‌గా విధుల్లో చేరిన మహిళపై అత్యాచారానికి పాల్పడాలని ముందే ప్రణాళిక రచించుకున్న డ్రైవర్.. దారిలో ప్రయాణికులను ఎవ్వరినీ ఎక్కించుకోకుండా పథకం ప్రకారం ఆమెను ఒంటరయ్యేలా చేశాడు. అనంతరం ఎవ్వరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. 

అయితే, డ్రైవర్ మనసులోని దురుద్దేశాన్ని పసిగట్టిన ఆ మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకోగలిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Trending News