Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు

దేశ రాజధాని ఢిల్లీ నేడు అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కింది ( Temperature in Delhi ). సఫ్దర్‌గంజ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలోనే 43.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు చేరే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ ( IMD ) అంచనా వేసింది.

Last Updated : May 22, 2020, 08:55 PM IST
Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు

న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నేడు అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కింది ( Temperature in Delhi ). సఫ్దర్‌గంజ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలోనే 43.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు చేరే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ ( IMD ) అంచనా వేసింది. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలుగా పేర్కొన్న భారత వాతావరణ శాఖ.. రానున్న రోజుల్లో ఎండలు మరింత మండిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. మరోవైపు నేడు రాజస్తాన్‌లోని చురు జిల్లాలో 46.2 డిగ్రీల సెల్సియస్ వేడితో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. Migrant workers : వలసకూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం )

భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సోమవారం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలుస్తోంది. అలాగే తెలంగాణ ( Temperature in Telangana ), మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని ఈశాన్య ప్రాంతమైన విదర్భలోనూ ఆదివారం వరకు అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.  తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల )

ఆంధ్రప్రదేశ్ ( Temperature in Andhra pradesh ), యానాం, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చెరి, కరైకల్ ప్రాంతాల్లోనూ శనివారం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News