రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీవీ తారలు మృతి

రోడ్డు ప్రమాదంలో తెలుగు టీవీ తారలు మృతి

Last Updated : Apr 17, 2019, 11:18 PM IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు టీవీ తారలు మృతి

చేవెళ్ల: తెలుగు బుల్లి తెరపై రాణిస్తున్న ఇద్దరు తారలు ఎప్పటిలాగే బుధవారం సీరియల్ షూటింగ్‌కి అని వెళ్తూ అనుకోకుండా రోడ్డు ప్రమాదంబారిన పడి దుర్మరణంపాలైన ఘటన బుల్లితెర ప్రపంచాన్ని షాక్‌కి  గురిచేసింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ వద్ద జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా అప్పారెడ్డి గూడెం బస్టాప్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డుపక్కనే వున్న చెట్టును వీళ్లు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ఆర్టిస్టులను అనుషా రెడ్డి, భార్గవిగా గుర్తించారు. భార్గవి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కాగా అనుషా రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసి. ముత్యాల ముగ్గు అనే సీరియల్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ చక్రి సహా మరో యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ సీరియల్ ఆర్టిస్టులు అనుకోకుండా ప్రమాదంబారిన పడి ప్రాణాలు కోల్పోవడం ముత్యాల ముగ్గు సీరియల్ యూనిట్ సభ్యులను తీవ్ర షాక్‌కి గురిచేసింది.

Trending News