Telangana Pending Traffic Challans Discount: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడగిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. రేపటితో పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ముగియనుండగా... ప్రజల నుంచి వస్తున్న స్పందన విజ్ఞప్తి మేరకు మరో 15 రోజుల పాటు గడువును పొడగిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల చలాన్ల చెల్లింపులు జరిగాయని.. తద్వారా రూ.250 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.
నిజానికి పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పొడగించే ఆలోచన లేదని రెండు రోజుల క్రితమే హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాబట్టి వీలైనంత త్వరగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని వాహనదారులకు సీపీ సూచించారు. ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చార్జిషీట్లు వేస్తామని, భారీ మొత్తంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు.
కాగా, పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు మార్చి 1 నుంచి మార్చి 31 వరకు రాయితీ అవకాశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ద్విచక్రవాహనదారులకు 75 శాతం, ఫోర్ వీలర్స్‌కు 50 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దీనికి భారీ స్పందన లభించింది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 43 శాతం మేర పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు చెబుతున్నారు. పెండింగ్ చలాన్ల ద్వారా రూ.275 కోట్ల ఆదాయం సమకూరగా.. ఇందులో ఒక్క పేటీఎం ద్వారానే రూ.60 కోట్ల పెండింగ్ చలాన్ల చెల్లింపు జరిగినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం వెల్లడించారు.
Also Read: కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ
ఇక వేములవాడపై కేసీఆర్ ఫోకస్.. చిన జీయర్‌కు చెక్.. త్వరలో భారతీ తీర్థ స్వామి వద్దకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook