Medaram: మేడారం జాతరలో రచ్చ.. డ్యూటీలో ఉన్న ఎస్సైని చెంపమీద కొట్టిన ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?

Mulugu: మేడారం సమ్మక్క సారాలమ్మ వేడుకలో డ్యూటీలో ఉన్న ఎస్సై పట్ల ఆదిలాబాద్ ఎస్పీ ఆలయం గౌష్ అమానుషంగా ప్రవర్తించారు. కుటుంబ సభ్యుల ముందే ఆయనపై చేయిచేసుకుని, సిబ్బందితో ఈడ్చీపడేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 25, 2024, 04:38 PM IST
  • మేడారం జాతర వద్ద ఎస్పీ వర్సెస్ ఎస్సై...
  • అందరి ముందే చేయిచేసుకున్న ఎస్పీ గౌస్ ఆలం..
Medaram: మేడారం జాతరలో రచ్చ.. డ్యూటీలో ఉన్న ఎస్సైని చెంపమీద కొట్టిన ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?

SP Gaush Alam Insulted SI In Medaram Jatara: మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర వేడుకగా జరిగింది. దేశం నలూమూలల నుంచి వనదేవదను దర్శించుకొవడానికి లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. ములుగులోని మేడారం పూర్తిగా, జనసంద్రంగా మారిపోయింది. తమ కొంగు బంగారమైన వనదేవతకు చాలా మంది బంగారం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఇక మరోక వైపు పోలీసులు సాధారణ జనాలకు ఒకలా, వీఐపీలకు మరోలా దర్శనాలు కల్పించే ఏర్పాట్లు చేశారు.

Read More: KGF Actress: వాళ్లతో పడక సుఖం ఒప్పుకోలేదని నాపై పగబడ్డారు.. కేజీఎఫ్ నటి సంచలన వ్యాఖ్యలు..

కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, తమ వారికి ప్రత్యేకంగా దర్శనం కల్పించారు, తమ డ్యూటీలను కూడా వదిలేసి తమ వారిని నేరుగా గద్దెల దగ్గరకు తీసుకెళ్లడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో భక్తుల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు పోలీసులకు వ్యతిరేంగా నిరసనలు కూడా తెలిపారు . ఇదిలా ఉండగా.. ఒక ఎస్సై తన బంధువులను వనదేవత దర్శనానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడున్న ఎస్పీ దీనికి అడ్డుచెప్పారు. అంతే కాకుండా కుటుంబ సభ్యుల ముందే సిబ్బందితో ఎస్సైని కొట్టారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాలు..

వరంగల్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ మేడారంలో జాతరలో విధులకు హజరయ్యారు. ఆయన రోప్ పార్టీ ఇన్ చార్జీగా డ్యూటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం.. తన కుటుంబ సభ్యులతో కలసి సమ్మక్క దర్శనం కోసం వెళ్లారు. ఆయన ఫ్యామిలీని క్యూలో పంపించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న ఎస్పీ గౌస్ ఆలం దీనిపై మండిపడ్డారు. డ్యూటీ వదిలేసి ఫ్యామిలీని .. లోపలికి పంపుతావా అంటూ ఎస్సైపై చేయిచేసుకున్నారు.

Read More: WaterMelon: పుచ్చకాయలను ఎక్కువగా తింటున్నారా..?.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

అతని కుటుంబ సభ్యులు ఎంతగా బతిమాలుతున్న ఎస్పీ అస్సలు పట్టించుకోలేదు. ఎస్పీ తనకు అధికారం ఉందని, తన భర్త ఎస్సైను నేలమీద కూర్చొబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్పీ కాళ్లు పట్టుకుని వేడుకున్న వదల్లేదని రవికుమార్ భార్య మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News