Young Man Used Vulgar Words On Traffic Police: హైదరాబాద్ లో యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద ఆంజనేయులు అనే యువకుడు వీరంగం చేశాడు. తన వాహనాన్ని ఆపాడాని ట్రాఫిక్ అధికారిపై నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా.. నా గురించి నీకు తెలియదు. నాతో పెట్టుకోకు. పంజాగుట్ట పీఎస్ లో నాగురించి అడుగంటూ కూడా ధమ్కీ ఇచ్చాడు. నేను మెంటల్ నా కొడుకుని.. , బాగుండందంటూ కూడా రెచ్చిపోయాడు.
ట్రాఫిక్ పోలీసుకు వార్నింగ్.. #TrafficPolice #Telangana pic.twitter.com/E9OTG52qP6
— Zee Telugu News (@ZeeTeluguLive) February 19, 2024
అయితే.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు కట్టి,బైక్ తీసుకెళ్లాలని చెప్పిన కూడా యువకుడు వినకుండా నానా హంగామా చేశాడు. బైక్ తాళాలు, లైసెన్స్ ఇవ్వాలని పదే పదే అధికారిని బెదిరింపులకు గురిచేశాడు. నాకు ఫ్యామిలీ లేదు... నీ గురించి ఆలోచించుకో అంటూ కూడా బెదిరింపులకు గురిచేశాడు. పోలీసు శాఖను కూడా నానా బూతులు తిట్టాడు. నేను చావడానికి రెడీ.. నువ్వు రెడీనా అంటూ కూడా ఆవేశంతో ఊగిపోయాడు.
ఇక యువకుడు ఎంతకి మాటవినకపోయే సరికి పోలీసులు అదనపు సిబ్బందిని యూసుఫ్ గూడ చెక్ పోస్టుకు రప్పించి పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు ఆంజనేయులు పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Read More: Mouni Roy Pics: బ్లాక్ డ్రెస్‌లో మత్కెక్కిస్తున్న మౌనీ రాయ్, లేటెస్ట్ పిక్స్ వైరల్
దీన్ని చూసిన నెటిజన్లు.. యువకుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు యువకుడి మెంటల్ కండీషన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కుటుంబాన్నిపీఎస్ కు రప్పించి, దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook