Telangana Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు?

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం (ఏప్రిల్ 7) ఉదయం విడుదల చేసింది. రానున్న మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 12:35 PM IST
Telangana Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు?

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం (ఏప్రిల్ 7) ఉదయం విడుదల చేసింది. రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఆ ప్రకటనలో తెలియజేసింది.  

ఉపరితల ద్రోణి మహారాష్ట్రలోని మరట్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు కొనసాగింది. ఈరోజు (ఏప్రిల్ 7) మరట్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు కొనసాగింది. సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దాంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.  

Also Read: Medchal Rape Case: మేడ్చల్ జిల్లాలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం!

Also Read: SriRama Navimi: రెండు సంవత్సరాల తరువాత కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. సిద్ధం అవుతున్న భద్రాచలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News