Telangana Rains Updates: దాదాపు నెలరోజులుగా భగభగమండే ఎండలు, వేడి గాలులతో తల్లడిల్లిన ప్రజలకు భారీ వర్షాలు ఉపశమనం కల్గించాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షాలకు తోడు రానున్న మూడ్రోజులు అదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. ఐఎండీ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మహారాష్ట్రలోని విదర్బ ప్రాంతం నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు ఈశాన్య రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో రానున్న మూడ్రోజులు అంటే మే 8,9,10 తేదీల్లో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ వివరించింది.
తెలంగాణలో రానున్న మూడ్రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని తెలుస్తోంది.
నిన్న తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవలికాలలో ఎన్నడూ లేనంత భారీవర్షం నమోదైంది.
శేర్‌లింగంపల్లిలో అత్యధికంగా 10.8, సికింద్రాబాద్‌లో 8.4, కేపీహెచ్‌పిలో 7, గాజుల రామారంలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో వర్షాలు పడనున్నందున రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంటుంది. పిడుగులు కూడా పడే ప్రమాదమున్నందున ఆరు బయట, బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద సంచరించవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
Also read: Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook