Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తర ఒడిశా, జార్ఘండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించనుంది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వాతావరణం వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ ఆదివారం రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షంపడవచ్చు. రేపు సోమవారం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. ఇక మంగళవారం, బుధవారం కూడా మోస్తరు వర్షాలు పడనున్నాయి. సెప్టెంబర్ 9 అంటే రేపటి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ అయింది. ఆసిఫాబాద్, మలుగు, భూపాలపల్లి జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, బేగంపేట్, సికింద్రాబాద్, ఆబిడ్స్, కోఠి, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
ఇక మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. మున్నేరు వాగు మరోసారి పొంగిపొర్లుతోంది. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మున్నేరు వాగు ప్రవాహం పెరుగుతోంది. దాంతో మున్నేరు వాగు పరీవాహక ప్రాంతంలో ప్రజల్ని అప్రమత్తం చేశారు. దన్వాయి గూడెం, రమణపేట్, ప్రకాశ్ నగర్, మోతి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంత ప్రజల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో మారాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Also read: AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.