హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ వెల్లడించిన ఫలితాల్లో వెలుగుచూసిన తప్పిదాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వివాదంపై స్పందించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్.. 21 వేల జవాబు పత్రాలు గల్లంతైనట్టుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. జవాబు పత్రాలు పోలీసుల కస్టడీలో పదిలంగా ఉన్నాయని మీడియాకు తెలిపారు.
మార్కుల వివాదంపై అశోక్ స్పందిస్తూ... ఎగ్జామినర్ చేసిన పొరపాటు కారణంగా ఈ సమస్య తలెత్తిందని.. అంతకుమించి మరే ఇతర సమస్య లేదని వివరణ ఇచ్చారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్కి దరఖాస్తు చేయించుకోవచ్చు అని చెబుతూ.. ఇంకా అవసరమైతే, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని సందేహాలు వున్నవారికి జవాబు పత్రాలు చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.