CM Kcr: బీజేపీపై సీఎం కేసీఆర్ ఉక్కు పిడికిలి బిగించారు. ఈనేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో వెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ పెట్టబోతున్నారని గతంలోనే విస్తృత ప్రచారం జరిగింది. ఐతే సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా మరో టూర్‌కు ఆయన సిద్ధమవుతున్నారు. ఈనెల 31న బీహార్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలు దేరనున్నారు. గతంలో ప్రకటించిన విధంగా సైనిక అమరవీరులకు చెక్కులను అందజేయనున్నారు.
గాల్వాన్ ఘర్షణలో అమరులైన బీహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు సీఎం కేసీఆర్. వీరితోపాటు ఇటీవల సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికులకు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. బీహార్ సీఎం నితిష్‌కుమార్‌తో కలిసి చెక్కులను పంపిణీ చేయనున్నారు. అమరులైన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు.
అనంతరం బీహార్ సీఎం నితిష్‌కుమార్ ఇంట్లో లంచ్ కార్యక్రమం జరగనుంది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈసందర్భంగా జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లలన్న దానిపై మంతనాలు జరపనున్నారు. ఇటీవల ఎన్డీఏ నుంచి జేడీయూ బయటకు వచ్చింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీయేతర పక్షాలతో సీఎం కేసీఆర్ వరుసగా సమావేశం అవుతున్నారు.
బీహార్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 3న ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ భేటీలో రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణ, తదితర అంశాలపై చర్చించనున్నారు. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. గతకొంతకాలంగా బీజేపీపై సీఎం కేసీఆర్ విమర్శలు ఎక్కిపెడుతున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే తన లక్ష్యమని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర అభ్యర్థులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో అదే దూకుడుతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో మరిన్ని టూర్‌లు ఉంటాయని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన కర్ణాటక, ఢిల్లీ వంటి ప్రాంతాలకు వెళ్లి మంతనాలు జరిపారు.
Also read:CM Jagan: సెప్టెంబర్ 1 నుంచి కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ టూర్..!
Also read:CM Kcr: బీజేపీ ముక్త్ భారత్‌కు అంతా కలిసి రావాలి..ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి