COVID-19 Cases: తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు

Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. నిన్న (సోమవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,599కి చేరింది.

Last Updated : Dec 15, 2020, 11:16 AM IST
  • కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం
  • తాజాగా 491 పాజిటివ్ కేసులు
  • నిన్న 596 మంది కోలుకున్నారు
COVID-19 Cases: తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు

Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. నిన్న (సోమవారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. తెలంగాణలో కేసులు తగ్గుముఖం పట్టినా, కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది.

సోమవారం ఒక్కరోజే 48,005 శాంపిల్స్‌కు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 491 శాంపిల్స్‌కు పాజిటివ్ రాగా, అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,499కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 596 మంది చికిత్స అనంతరం కరోనా వైరస్ (CoronaVirus) నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,69,828 మంది కోవిడ్-19 నుంచి బారి కోలుకున్నారు. 

Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే

కాగా, తెలంగాణలో ప్రస్తుతం 7,272 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో 5,169 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న 101 కేసులు నమోదు కాగా, తాజాగా 102 కరోనా పాజిటివ్ కేసులు రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read: Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News