హైదాబాబాద్: తెలంగాణ ఎన్నికల వేళ్ల పార్టీ ఫిరాయింపులు, వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం జలగం వెంకట్రావు తనయుడు జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మాజీ మంత్రి గా జలగం ప్రసాదరావు బాధ్యతలు చెపట్టారు. అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం 1999లో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ప్రసాదరావు.. ఇటవలే పొలిటికల్ రీ ఎంట్రీ కోసం కసరత్తు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ఆగ్రనేతలు ఆహ్వానించారు..
ప్రముఖ మీడియా కథనం ప్రకారం జలగం ప్రసాదరావు తొలుత కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. కొందరు కాంగ్రెస్ పెద్దలు అడ్డుకుంటున్నారని తెలిసింది. ఈ పరిణాపంపై మనస్తాపం చెందిన ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. తన రాజకీయ భవితవ్యంపై గురువారం పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలోని తన స్వగృహంలో అనుచరులతో సమాలోచనలు జరిపినట్లు కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన ప్రసాదరావు తనను పార్టీలో చేరమని టీఆర్‌ఎస్ అగ్రనేతల నుంచి ఆహ్వానం అందినట్లు స్వయంగా మీడియాకు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులు..
ప్రసాదరావు టీఆర్ఎస్ లో చేరిక వార్త విని అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం హడావుడిగా ఆయనపై ఉన్న సస్పెన్సన్‌ను ఎత్తివేసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌కు శుక్రవారం సమాచారం అందించిననట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ దూతలు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లోచేరేందుకు మొగ్గుచూపతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మూహుర్తం ప్రసాదరావు ఖారారు చేసుకున్నారని.. శనివారం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు రాజకీయాల్లో వర్గాల్లో టాక్. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాదరావుకు సీఎం కేసీఆర్ టికెట్ ఆఫర్ చేశారని ..కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన టీఆర్ఎస్ గూటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు రాజకీయవర్గాలు నుంచి సమాచారం