అమెరికా సలహాదారు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన తెలంగాణ పోలీసుల సేవలు భేష్ అని అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలో "తెలంగాణ పోలీస్" సేవలను పొగుడ్తూ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ టీమ్ అధిపతి రిచర్డ్స్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఓ లేఖ రాశారు. విరామం లేకుండా రాత్రిళ్ళు, పగలు సేవలందించిన పోలీసులకు ఆ లేఖలో ధన్యవాదాలు కూడా తెలిపారు. వారి శ్రమ వల్లే ఇవాంక పర్యటన సజావుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిందని కూడా లేఖలో పేర్కొన్నారు.
భద్రత విషయంలో, తనిఖీల విషయంలో తెలంగాణ పోలీసులు తమకు సహకరించిన తీరు ప్రశంసనీయమని అమెరికన్ సీక్రెట్ సర్వీస్ టీమ్ పేర్కొంది. ఈవెంట్ జరిగినన్ని రోజులు తెలంగాణ పోలీసులు, అమెరికన్ సీక్రెట్ సర్వీసు సభ్యులతో కలిసి పనిచేశారు. అందుకు తగ్గ ప్రణాళికలు రచించారు. తొలుత వెస్టిన్ హోటల్‌లో ఇవాంక బస చేస్తారని తెలిపినా... సీక్రెట్ సర్వీస్ టీమ్ ఆఖరి నిముషంలో అదే బసను ట్రైడెంట్ హోటల్‌కు మార్చేసింది. అదేవిధంగా స్పెషల్ విమానంతో ఇవాంక వస్తారని తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత సాధారణ ప్రయాణికుల విమానంలోనే ఆమె ప్రయాణించడం గమనార్హం.
<
>
తెలంగాణ పోలీస్ సేవలు అదుర్స్: అమెరికా