హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం రోజురోజుకూ వ్యాప్తి జరుగుతూనే ఉంది. కాగా, ఇది కోళ్లకు సోకిందని, చికెన్ తినడం వల్లే వస్తుందన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చికెన్, ఎగ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, వేదికపైనే మంత్రులతో కలిసి చికెన్ తింటూ దీనిపై వస్తున్న అపోహలను తొలగించే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని, ఇందులో భాగంగానే చికెన్ ముక్క రుచి చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చికెన్ పై వస్తున్న అపోహలను నమ్మవద్దని, దీనిపై ఆవగాహన కల్పించాలని సమావేశంలో పేర్కొన్నారు.
కాగా, శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేసే కరోనావైరస్ భూతం మొట్టమొదటగా చైనాలోని వుహాన్ నగరం నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించబడిందని, చైనా నుండి భారత్ కు తరలివచ్చిన వారిని రెండు వారాల పాటు ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి పరిశీలన పూర్తయిన తరవాత అక్కడినుండి పంపించేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..