Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్.. ఫ్రీడమ్ ర్యాలీలో కలకలం.. రాజీనామా చేస్తారా?

Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు.

Written by - Srisailam | Last Updated : Aug 13, 2022, 04:36 PM IST
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్..  ఫ్రీడమ్ ర్యాలీలో కలకలం.. రాజీనామా చేస్తారా?

Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో ఆయన హల్ చల్ చేశారు. పోలీసులకు చెందిన SLR వెపన్ తో మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. గన్ తో మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్నా పోలీసులు అభ్యంతరం చెప్పలేదు. వందలాది మందితో కలిసి ర్యాలీ తీసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలా పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరపడం తీవ్ర వివాదమవుతోంది.

ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాల్పుల వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ గా మారింది. మంత్రి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలో మంత్రికి గన్ ఎలా ఇచ్చారంటూ  పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారని తెలుస్తోంది. మంత్రికి గన్ ఇవ్వడంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

ఫ్రీడమ్ ర్యాలీలోగన్ ఫైర్ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. స్పోర్ట్స్ మీట్స్ లో గన్ ఫైర్ చేయడం కామనే అన్నారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని చెప్పారు. తాను రైఫిల్ అసొసియేషన్ మెంబర్ గా ఉన్నానన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తనకు ఎస్పీనే తుపాకి ఇచ్చారన్నారు.  క్రీడామంత్రిని తనకు గన్ ఫైర్ చేసే అర్హత ఉంటుందన్నారు.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా ఎస్పీ ని సరైన సమాచారం తెలుసుకోవాలని సూచించారు . ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారని చెప్పారు. తాను నిజమైన బుల్లెట్ కాల్చినట్లే అయితే రాజీనామా చేస్తానని తెలిపారు శ్రీనివాస్ గౌడ్.

Read also: Ashwini Dutt: ఆ నిర్మాతలను టార్గెట్ చేస్తూ అశ్వినీదత్ సంచలనం.. సహకరించే వాడికి కానంట

Read also: Munugode Trs: మునుగోడు టీఆర్ఎస్ లో ట్విస్ట్..  టికెట్ రేసులో కర్నె, కంచర్ల? అసమ్మతి స్వరంతో కూసుకుంట్ల అవుట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

 
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News