Harish Rao on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ జ్వాలలు కొనసాగుతోంది. ఈపథకంలో కేంద్రం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా..ఆందోళనలు ఆగడం లేదు. ఇటు అగ్నిపథ్ అంశం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. రైతు చట్టాలు లాగే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని మండిపడుతున్నారు. తాజాగా మోదీ సర్కార్‌పై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని ఆక్షేపించారు. అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయని ఫైర్ అయ్యారు. రక్షణ రంగంలోనూ ప్రైవేటీకరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ ఘటనలో యువకుడు చనిపోవడం దురదృష్టకరమన్నారు. అల్లర్ల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని బీజేపీ ఆరోపించడం సిగ్గు చేటు అన్నారు.
సికింద్రాబాద్ ఆందోళనలో టీఆర్ఎస్ ప్రమేయం ఉంటే..బీహార్, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనలు వెనుక అక్కడి అధికార పార్టీలు ఉన్నాయా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారని తెలిపారు. అగ్నిపథ్‌లో యువకులను తీసుకుని..నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి భవిష్యత్ ఏం కావాలని సూటిగా ప్రశ్నించారు.
మొదటి నుంచి మోదీ ప్రభుత్వ మాటలు తీయగా..చేతలు చేదుగా ఉన్నాయని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అచ్చే దిన్ ఏమయ్యిందని ప్రధాని మోదీని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమి లేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేకపోయారన్నారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్, భీంగల్, మోర్తాడ్ మండలాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రాగం..రాగల మూడురోజులపాటు వర్షాలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Harish Rao on Agnipath: ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే అగ్నిపథ్..కేంద్రంపై హరీష్ ఫైర్..!
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ జ్వాలలు
కేంద్రప్రభుత్వంపై విమర్శలు
తాజాగా మంత్రి హరీష్‌రావు విసుర్లు