Employee died in election duty due to heart stroke in Bhadradri kothagudem: కేంద్ర ఎన్నికల సంఘం రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగో విడతల ఎన్నికలను నిర్వహిస్తుంది. ఉదయం నుంచి రెండు తెలుగు స్టేట్స్ లలో ప్రజలు ఓటు వేయడానికి స్వచ్చంగా ముందుకు వస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించడం కూడా కొంత కత్తిమీద సాముగానే చెప్పుకొవచ్చు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ బ్యాలెట్ లు, ఈవీఎంలు అన్ని చెక్ చేసుకొవాలి. కొన్నిసార్లు ఈవీఎంలలో ఏదైన లోపాలుంటే, అది తీసుకున్న సిబ్బందికి తలనొప్పిగా మారుతుంది. ఇక ఎన్నికల కేంద్రానికి వెళ్లినప్పటి నుంచి పోలింగ్ అయిపోయి, ఈవీఎంలను మరల అధికారులకు అప్పజేప్పే వరకు కూడా ఉద్యోగులకు ఒకరకమైన టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఎన్నికలు జరిగే సమయంలో విధుల్లో పాల్గొనే అధికారులు కొందరు ఆరోగ్య సమస్యలతో ఉంటారు.
Read More: Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
సరైన ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి గురౌతుంటారు. దీనికి తోడు. ఎన్నికల కేంద్రంలో ఏదైన గొడవలు జరిగితే.. అది కాస్త పోలింగ్ స్టాఫ్ లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా కొంత ఇబ్బందులకు గురౌతుంటారు. ఈ నేపథ్యంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ వేళ అపశృతి చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాకర సంఘటన చోటు చేసుకుంది. అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా.. నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగికి ఉదయాన్నే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే తోటీ సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. వెంటనే సిబ్బంది, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదిలా ఉండగా మృతుడు.. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాట్లు తెలుస్తోంది. శ్రీ కృష్ణ మృతితో ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఎన్నికల విధుల్లోకి వెళ్లి, ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుడి కుటుంబాన్ని, ఈసీ, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండగ.. మరోవైపు పోలింగ్ లో పాల్గొంటున్న సిబ్బందికి మంచి రుచికరమైన, హెల్తీ డైట్ ను అందించే ఏర్పాట్లను చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter